ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పనుల పురోగతిపై హౌసింగ్ అధికారులతో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమీక్ష నిర్వహించారు. ప్రతి అర్హత గల కుటుంబానికి ఇల్లు అందే వరకు కృషి చేయాలని అధికారులకు ఆయన కఠిన ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించి, జూన్ 2 నాటికి ఇళ్లు పూర్తి చేయాలని సూచించారు.