లింగంపేట మండల శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన చిన్న సాయిలు అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ తప్పనిసరి అని వైద్యులు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న సాయిలు కుటుంబ సభ్యులు శనివారం ఎమ్మెల్యే మదన్ మోహన్ ను సంప్రదించారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం తరపు నుండి చికిత్స నిమిత్తం 2లక్షల రూపాయల ఎల్ఓసి పంపించారు. ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు.