ఎల్లారెడ్డి నీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ

ఎల్లారెడ్డి పట్టణంలో నెలకొన్న నీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృషి చేస్తున్నారని మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు. మంగళవారం, చైర్మన్ చేతుల మీదుగా నూతన బోరు మోటార్లను ప్రారంభించారు. ప్రజల వినతి మేరకు ఎమ్మెల్యే వెంటనే స్పందించి, పలు వార్డుల్లో నూతన బోరు మోటార్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారని తెలిపారు. ముఖ్యంగా రెండో వార్డులోని పాత ప్రియ థియేటర్ ఏరియాలో అనేక సంవత్సరాలుగా నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు పరిష్కారం చూపారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్