ఎల్లారెడ్డి: గిరిజన బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గిరిజన బాలికల గురుకుల పాఠశాలను ఆదివారం ఎమ్మెల్యే కే. మదన్ మోహన్ రావు ఆకస్మిక తనిఖీ చేసారు. తరగతి గదులను, వంటగదిని, వంట సామాగ్రిని పరిశీలించారు. భోజనంలో తేడా వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందంతో సమావేశమై వెల్లడించారు. విద్యార్థినులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్