ఎమ్మెల్సీ కవిత తాపీ మేస్త్రిలపై చేసిన వ్యాఖ్యలు సరికాదు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సెంట్రింగ్ మేస్త్రిల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, 'తాపీ మేస్త్రి హటావో సెంట్రింగ్ మేస్త్రి బచావో' అంటూ తాపీ మేస్త్రిలను అవమానించే వ్యాఖ్యలు చేయడం బాధాకరమని భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం జిల్లా ఇంచార్జి మర్లు సాయిబాబు అన్నారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తాపీ మేస్త్రిలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్