ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీవో

శనివారం నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూర్ అచ్చాయిపల్లి గ్రామాలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎంపీడీవో శ్యామల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా, నాణ్యతతో చేపట్టి త్వరగా పూర్తి చేసి, ప్రభుత్వం అందించే బిల్లులను సకాలంలో పొందాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రభాకర్ చారి, పంచాయతీ కార్యదర్శులు వెంకట్ రాములు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్