కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డిలో భూగర్భ జలాల పెంపునకు హార్వెస్టింగ్ పాండ్స్, మ్యాజిక్ సోక్పిట్ల నిర్మాణాలు చేపట్టాలని ఎంపీడీవో తహెరా బేగం శనివారం సూచించారు. సోమర్యాగడి తండాలో అభివృద్ధి పనులను పరిశీలించి, రైతు నిర్మిస్తున్న నీటి నిల్వ చెరువు పనులను తనిఖీ చేశారు. జలసిరి పనుల్లో భాగంగా 10 కుటుంబాలకు మ్యాజిక్ సోక్పిట్ల నిర్మాణానికి మార్కౌట్ చేయించారు. అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్య, మధ్యాహ్న భోజనం నాణ్యతపై సూచనలు చేశారు.