కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి పరిధిలోని నాగిరెడ్డిపేట మండలం పల్లెబోగుడ తండాలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఉపాధి హామీ పనులను తనిఖీ చేశారు. కూలీల హాజరు పట్టికను పరిశీలించి, వేసవి దృష్ట్యా వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు సూచించారు. కూలీలకు తాగునీరు, నీడ కోసం నెట్ షెడ్ ఏర్పాటు చేశారు. తీవ్ర ఎండల కారణంగా ఉపాధి హామీ పనులను ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని ఫీల్డ్ అసిస్టెంట్ కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిపి సెక్రెటరీ, ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.