ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మున్సిపల్ చైర్మెన్

కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని మున్సిపల్ చైర్మెన్ పద్మ శ్రీకాంత్ శుక్రవారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నూతన గృహ ప్రవేశ వేడుకలో పాల్గొని పూజలు చేశారు. నిలువ నీడ లేని నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇంటి పథకం పేదల పాలిట వరంగా మారిందని చైర్మెన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, వార్డు కౌన్సిలర్లు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్