ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, కమిషనర్ జగ్జీవన్, వార్డు కౌన్సిలర్లతో కలిసి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2వ వార్డులోని వినాయక మండపం వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కంచర్ల వినాయక మండలి వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగం సాయిబాబా గణేష్ మండలిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.