పట్టణ బీజేపీ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ ఆదివారం మాట్లాడుతూ, మున్సిపల్ ఓటరు జాబితా తప్పులతడకగా మారిందని ఆరోపించారు. షెటర్లు, షాపింగ్ మాల్స్, లాడ్జీలపై వందల ఓట్లు ఉన్నాయని, గతంలో బీఆర్ఎస్ కూడా ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేసిందని ఆయన అన్నారు. కమిషనర్ కు చెప్పినా పట్టించుకోవడం లేదని, అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 12న బీజేపీ మున్సిపల్ ముట్టడి చేపడుతుందని తెలిపారు. ప్రతి బీజేపీ కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో 34 వ వార్డు మాజీ కౌన్సిలర్ ఆకుల సుజిత, బీజేపీ నేతలు పాల్గొన్నారు.