ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని వారి నివాసానికి వెళ్లి, నాదెండ్ల భాస్కర్రావు చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం, నాదెండ్ల భాస్కర్రావు కుమారుడు, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, నాదెండ్ల భాస్కర్రావు రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.