నాగిరెడ్డిపేట మండలంలో పదో తరగతి పరీక్షల్లో 98.51% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మండల విద్యాశాఖ అధికారి వెంకట్రామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, బొల్లారం, ఆత్మకూర్, మాల తుమ్మెద, తాండూర్, గోపాల్పేట్, జిల్లా పరిషత్ హైస్కూల్స్, కేజీబీవీ మోడల్ స్కూల్స్ నుండి మొత్తం 402 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 396 మంది ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి ఆర్. సందీప్/రంగి ఈశ్వరయ్య (చీనూరు గ్రామం) 574/600 మార్కులతో మండల టాపర్‌గా నిలిచి ప్రథమ ర్యాంకు సాధించగా, అదే పాఠశాలకు చెందిన హర్షిత్ కుమార్/దుర్గయ్య 565/600 మార్కులతో రెండవ స్థానంలో నిలిచారు.