బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల తేది 11, 12 తేదీల్లో రెండు రోజుల పాటు నూతన జాతీయ విద్యా విధానం 20-20 పై జాతీయ సదస్సు జరగనుందని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రముఖర్జీ ఒక ప్రకటనలో ప్ఎర్కొన్నారు. రెండు రోజులపాటు సాగే ఈ జాతీయ సదస్సులో నూతన విద్యా విధానంపై అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో వక్తలుగా దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు హాజరవుతున్నారని తెలిపారు.