బీర్కూరు మండలం రైతునగర్‌లో రూ. 10 లక్షలతో నిర్మించిన గ్రామైక్య సంఘం భవనం, రూ. 30 లక్షలతో నిర్మించిన ధాన్య నిల్వ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. మహిళా సంఘాల బలోపేతానికి గ్రామైక్య భవనం, రైతుల ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసుకునేందుకు నిల్వ కేంద్రం ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.