ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో డీఎస్పీ కార్యాలయం మార్చబడింది. శుక్రవారం నూతన డీఎస్పీ కార్యాలయము ప్రారంభోత్సవం జరిగింది. నూతన డీఎస్పీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో యోగ పరివారము యజ్ఞము నిర్వహించారు. డీఎస్పీ కార్యాలయంపై భాగంలో నూతన గృహం ఏర్పాటుకు సైతం అనుమతి లభించడంతో గృహప్రవేశం చేసారు. కార్యాలయానికి ఎంతో విలువతో కూడిన ఈ భవనం కేటాయింపుతో కొత్త అందాన్ని సంతరించుకుంది.