కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం జనగామలో నవవధువు అనూష (20) గురువారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రెండు నెలల క్రితం రాజశేఖర్‌తో ఆమె వివాహం జరిగింది. ఇష్టం లేని వివాహమే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.