నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి సాగునీటి అవసరాల కోసం ప్రధాన కాలువ ద్వారా 4వ విడతలో భాగంగా, బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు 1200 క్యూసెక్స్ నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. కాలువల పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు, రైతులు, పశుపాలకులు అప్రమత్తంగా ఉండాలని, కాలువలోకి లేదా కాలువ ఒడ్డుల సమీపానికి వెళ్లవద్దని సూచించారు. ప్రజల భద్రత దృష్ట్యా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.