ఫిబ్రవరి లో సైతం నిండుకుండలా నిజాంసాగర్ ప్రాజెక్టు

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల రైతులకు నిజాంసాగర్ ప్రాజెక్టు వరప్రదాయినిగా మారింది. ఫిబ్రవరి 5 నాటికి నిండుకుండలా తొణికిసలాడుతున్న ప్రాజెక్టుతో ఆయకట్టు రైతులకు రబి పంట సాగునీటి కష్టాలు తప్పనున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 1403.31 అడుగుల నీరు నిల్వ ఉంది. ఎండల వల్ల రోజుకు 282 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోందని, ప్రధాన కాలువకు నీటిని నిలిపివేసినట్లు ఏఈ సాకేత్ తెలిపారు.

సంబంధిత పోస్ట్