ఆదివారం ఎల్లారెడ్డి పట్టణంలో ఒడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఒడ్డెర కులస్తుల ఆరాధ్యదైవం ఒడ్డె ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఒడ్డే ఓబన్న చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. లక్ష్మాపూర్ గ్రామ ఉపసర్పంచ్ సాయిరాం మాట్లాడుతూ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సాయుధ పోరాటంలో ఒడ్డె ఓబన్న సైన్యాధ్యక్షుడిగా పనిచేశారని, బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన మహావీరుడని కొనియాడారు. సంచార జాతిలో పుట్టిన ఆయన సేవలు మరువలేనివని, ఆయన చూపిన తెగువ ఓడ్డర జాతికి స్ఫూర్తి అని అన్నారు.