మల్లుపేటలో భారీ వర్షానికి తడిసిన వరి ధాన్యం

ఎల్లారెడ్డి సెగ్మెంట్ సదాశివనగర్ మండలం మల్లుపేట గ్రామంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి తెచ్చిన రైతుల వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఈ విషయం తెలుసుకున్న సదాశివనగర్ మాజీ జడ్పిటీసి, బీఆర్ఎస్ నాయకుడు రాజేశ్వర్ రావు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సకాలంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నాయకుడు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్