పోచారంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నాగిరెడ్డిపేట్ మండలం పోచారం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ సంజీవరావు, మండల ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని ఇక్కడ విక్రయించి లాభదాయకమైన మద్దతు ధర పొందాలని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని వారు తెలిపారు. 'ఎ' రకం ధాన్యం క్వింటాల్కు 2389, 'బి' రకం ధాన్యం క్వింటాల్కు 2369 రూపాయల చొప్పున ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్ముకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్