కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం తాడ్వాయి మండలం కరడ్ పల్లి వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేంద్రంలో వరి కొనుగోలు ప్రక్రియ, రైతుల రాకపోకలు, గన్నీ బ్యాగుల లభ్యత, రవాణా సదుపాయాలను ఆయన స్వయంగా పరిశీలించి, కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు. ఖరీఫ్ 2024-25 సీజన్‌లో 4064.40 క్వింటాళ్ల వరి కొనుగోలు జరిగిందని, దీని ద్వారా 118 మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు.