ఎల్లారెడ్డి పట్టణంలోని పద్మశాలి సంఘ భవనంలో బుధవారం, 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు సిరిగాద లక్ష్మీనరసింలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు విద్య రవికుమార్, ప్రధాన కార్యదర్శి పద్మ కాశీరాం, కోశాధికారి గూడ రామకృష్ణ, ఉపాధ్యక్షులు షేర్ల సోమేశ్వర్, మహిళా అధ్యక్షురాలు నామ విజయలక్ష్మి, తమ్మల లాస్య, గూడ మానస, మ్యాతరి సుజాత, పట్టణ పెద్దలు, కార్యవర్గ సభ్యులు, మండల సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం కార్యకలాపాలు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు.