ఎల్లారెడ్డి పురపాలక ఎన్నికల నేపథ్యంలో, బీజేపీ రాష్ట్ర నేత డా. పైడి ఎల్లారెడ్డి గురువారం పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. డైలీ మార్కెట్, బంగారు దుకాణాలు, ఫిష్ మార్కెట్ వంటి పలు ప్రాంతాల్లో కార్యకర్తలతో కలిసి ఆయన పర్యటించి, కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ 12 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ, ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.