జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఎల్లారెడ్డి సెగ్మెంట్ వాసి, జపాన్ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్రనేత డా: పైడి ఎల్లారెడ్డి, ఎల్లారెడ్డి సెగ్మెంట్ బీజేపీ నేతలతో కలిసి శనివారం రామహత్నగర్ డివిజన్ పరిధిలో బూత్ లేవెల్ ప్రచార వ్యూహంలో భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ను కలిశారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సలహాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మేడ్చల్ బీజేపీ అధికార ప్రతినిధి హైమరెడ్డి కూడా పాల్గొన్నారు.