గత రెండు రోజుల క్రితం రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులకు వెళ్తున్న కూలీల ట్రాక్టర్ బోల్తా పడి గాయపడిన వారిని బుధవారం కామారెడ్డి ఏరియా హాస్పిటల్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్. పైడి ఎల్లారెడ్డి పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన వైద్యులను కోరారు.