ఎల్లారెడ్డి: అంగన్వాడి పాఠశాలకు ఫ్యాన్, పలకలు వితరణ చేసిన పాష

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని రెండో వార్డు పరిధిలోని అంగన్వాడీ పాఠశాలలో చిన్నారులకు ఫ్యాన్ లేక ఉక్కపోతగా ఉండడంతో శుక్రవారం సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షుడు పాషా అంగన్వాడీ కేంద్రానికి ఫ్యాన్ అందజేశారు. అలాగే అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న చిన్నారులకు పలకలను అందజేశారు. ఫ్యాన్, పలకలు అందజేసిన పాషాను అంగన్వాడీ టీచర్ తో పాటు కాలనీవాసులు అభినందించారు.

సంబంధిత పోస్ట్