రోడ్డు ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు గాయాలు

మంగళవారం సదాశివనగర్ మండలం మర్కల్ శివారులో రోడ్డుపై ఓవర్టేక్ చేస్తూ వెళ్తున్న లారీ, కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొంది. నిజామాబాద్ నుంచి కామారెడ్డి వస్తున్న బస్సును లారీ రెండుసార్లు ఓవర్టేక్ చేయబోయి, బస్సును తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పాక్షికంగా ధ్వంసమైంది. బస్సులో ప్రయాణిస్తున్న 26 మందిలో కొందరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్