నాగిరెడ్డిపేట మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన చిటుకుల పోచయ్య(38) శుక్రవారం విద్యుత్‌ఘాతానికి గురై మృతి చెందినట్లు ఎస్ఐ. మల్లారెడ్డి తెలిపారు. మృతుడు పోచయ్య తన వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ వైర్లు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ఘాతానికి గురయ్యారన్నారు. మృతుని భార్య పారిజాతం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.