బుధవారం నిమ్స్ ఆసుపత్రిలో ప్రభుత్వ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న సౌమ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్యులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించిన ఎమ్మెల్యే, సౌమ్య త్వరగా కోలుకుని విధుల్లో చేరాలని ఆకాంక్షించారు.