పోలీసుల చొరవతో 24 గుంటలో భూ వివాదానికి ముగింపు

నాగిరెడ్డిపేట మండలంలోని బంజారా గ్రామంలో ఎన్నేళ్లుగా కొనసాగుతున్న 24 గుంటల భూ వివాదాన్ని నాగిరెడ్డిపేట్ పోలీసులు శాశ్వతంగా పరిష్కరించారు. ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించగా, పరస్పర అంగీకారంతో రాజీ కుదిరింది. గతంలో ఘర్షణలు, కేసులు నమోదైనా, ప్రస్తుతం సఖ్యతతో ఉండాలని ఇరు వర్గాలు అంగీకరించాయి. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ వివాదాన్ని పరిష్కరించినట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ప్రజల మధ్య సామరస్యాన్ని నెలకొల్పేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్