మాజీ జడ్పిటీసి వాహనం తనిఖీ చేసిన పోలీసులు

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. బుధవారం ఉదయం కామారెడ్డి జిల్లా సరిహద్దులోని నాగిరెడ్డిపేట మండలం పోచారం సమీపంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. మొబైల్ చెకింగ్ వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో, హైదరాబాద్ నుండి నాగిరెడ్డిపేట వస్తున్న బీఆర్ఎస్ నేత, మాజీ జడ్పిటిసీ మనోహర్ రెడ్డి వాహనాన్ని పోలీసులు ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్