గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతంగల్ గ్రామ అటవీ ప్రాంతంలో రహస్యంగా నిర్వహిస్తున్న జూద స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు గాంధారి ఎస్‌ఐ మహిందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 48,100 నగదు, 4 మొబైల్ ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్టపరమైన కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.