డయల్-100కు అందిన సమాచారంతో కామారెడ్డి టౌన్ పోలీసులు శనివారం రాత్రి కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి రైల్వే స్టేషన్‌కు వెళ్లిన ఓ మహిళ, ఆమె కుమారుడిని చాకచక్యంగా రక్షించారు. పోలీసు సిబ్బంది మహిళ ఫోటోను సేకరించి, సంఘటనా స్థలానికి చేరుకుని కేవలం 5 నిమిషాల్లో వారిని సురక్షితంగా గుర్తించి కాపాడారు. సకాలంలో స్పందించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.