నేడు సదాశివనగర్ లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని సదాశివనగర్ మండలంలో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. విద్యుత్ ఏఈ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం, మండల కేంద్రంతో పాటు ధర్మారావుపేట, మల్లుపేట గ్రామాల్లో ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. సబ్ స్టేషన్ లో మరమ్మతులు చేపట్టనున్నందున ఈ అంతరాయం కలుగుతుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్