ఎల్లారెడ్డిలో మాజీ సర్పంచుల ముందస్తు అరెస్టు

పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ సోమవారం అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా కళ్యాణి గ్రామ బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ శర్వాయిగారి రఘువీర్ గౌడ్, తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ అబ్దుల్ అలీ, నాగిరెడ్డి పేట్ మండలం బొల్లారం గ్రామ మాజీ సర్పంచ్ దేశబోయిన సాయియులు లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమకు న్యాయబద్ధంగా చేసిన పనుల బిల్లులు మంజూరు కోసం అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా అరెస్ట్ చేయడం అప్రజాస్వామ్యమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్