ఎల్లారెడ్డి సెగ్మెంట్ లో విధ్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డిలో రూ. 3. 5 కోట్లతో నిర్మిస్తున్న కేజీబివి బాలికల విద్యాలయ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. విద్య సమాజాభివృద్ధికి మూలస్తంభంగా భావిస్తూ.. పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. కాంట్రాక్టర్‌లు, అధికారులతో సమావేశమై నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు.