వాలీబాల్ టవర్నమెంట్స్ విజేతలకు బహుమతుల ప్రధానం

కామారెడ్డి పట్టణంలోని 13వ వార్డులో నంగునూరి నాగరాజ్ జ్ఞాపకార్థం నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్స్ లో విజేతలకు ఆదివారం టీపీసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా కప్ లను అందించారు. 9 టీమ్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్ లో గల్లీ బాయ్స్ టీం ఫస్ట్ విన్నర్ గా నిలవగా, చిల్లీ బాయ్స్ రన్నర్ గా నిలిచింది. విజేతలకు రూ. 3000, రన్నర్లకు రూ. 2000 నగదు బహుమతులు అందజేశారు. యువత క్రీడారంగంలో ఏకమై ఉండాలని, వారికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు శంకర్ రావు, పంపరి శ్రీనివాస్, సుధాకర్, సేవాదళ్ అధ్యక్షులు మహేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్