గజ పల్లకీపై సీతారామ విగ్రహాల ఊరేగింపు

శ్రీ రామ నవమి నుండి ప్రతిరోజూ రాత్రి పట్టణంలోని రామాలయం నుంచి సీతారాముల విగ్రహాలను వాహనంపై ఊరేగిస్తున్నారు. ఆదివారం రాత్రి గజవాహనంపై పల్లకిలో సీతారామ విగ్రహాలను ఉంచి, కాగడాల వెలుగులో, సన్నాయి మేళంతో రాజరాజేశ్వర ఆలయం వరకు ఆలయ ధర్మకర్త కుమారుడు సిద్ది చంద్రప్రకాష్, భక్తులతో కలిసి ఊరేగింపుగా పల్లకీ సేవ నిర్వహించారు. కాలనీ వాసులు, మహిళలు ఉత్సవ విగ్రహాలను దర్శించుకుని, టెంకాయలు కొట్టి, హారతులతో పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్