ఎల్లారెడ్డిలో నిషేధిత మాంజా స్వాధీనం: కేసు నమోదు

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డి పట్టణంలో నిషేధిత చైనా మాంజా విక్రయాలపై ఎస్ఐ బొజ్జ మహేష్ నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొన్ని షాపుల్లో అక్రమంగా విక్రయిస్తున్న 'చైనా మాంజా (నైలాన్, గ్లాస్ పౌడర్ కలిగిన మాంజా)ను గుర్తించి, సుమారు రూ. 2,200 విలువైన మాంజాను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత మాంజా విక్రయాలు చేపట్టిన పద్మ బాలకృష్ణ, పన్నాలాల్ కాలనీ, బెస్త మల్లేష్ కుమ్మరి గల్లీ అనే ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్