హిందు దేవిదేవతలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బిచ్కుంద మండలంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు బీజేపీ బిచ్కుంద మండల పార్టీ అధ్యక్షుడు శెట్పల్లి విష్ణు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ నాయకులు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు. ఈ నిరసనలో భాగంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయనున్నారు.