కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 73 మందికి కామారెడ్డి కోర్టులో శిక్షలు పడ్డాయి. వీరిలో 10 మందికి ఒక రోజు జైలు శిక్ష విధించగా, మిగిలిన వారిపై రూ. 67,500 జరిమానా విధించారు. తాగి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన తెలిపారు.