పెద్ద ఆత్మకూరు జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించిన పుట్ట శ్రీనివాస్ రెడ్డి

నాగిరెడ్డిపేట్ మండలంలోని పెద్ద ఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం జిల్లా పిఆర్టియుటిఎస్ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పుట్ట శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలో ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆయనను శాలువా కప్పి సన్మానించారు.

సంబంధిత పోస్ట్

✕
✕