పాడుబడ్డ బావిలో శవమై తేలిన రాజిరెడ్డి

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో భూమి కొనుగోలు విషయంలో జరిగిన వివాదంలో రాజిరెడ్డి(45) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఆరేళ్ల క్రితం మంచాల ఎల్లయ్య వద్ద భూమి కొనుగోలు చేసి డబ్బులు బాకీ ఉన్న రాజిరెడ్డితో శుక్రవారం రాత్రి గొడవ జరిగింది. అనంతరం అతను అదృశ్యమయ్యాడు. శనివారం అతని మృతదేహం పాడుబడ్డ బావిలో లభ్యమైంది. ఈ మిస్టరీ కేసుపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్