ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఎన్ ఎస్ ఎస్ యూనిట్ 1, 2, జంతుశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్. ఇ. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఎయిడ్స్ మహమ్మారికి అంతం పలుకుదామని, దీనికి మందు లేదని, నివారణే ఏకైక మార్గమని తెలిపారు. ఇది అంటు వ్యాధి కాదని, అంటించుకునే వ్యాధి అని ఆయన పేర్కొన్నారు.