ఎల్లారెడ్డి ఆర్డీఓగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పార్థసింహ రెడ్డిని శుక్రవారం కామారెడ్డి జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాగం సురేందర్ ఆధ్వర్యంలో రేషన్ డీలర్లు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆర్డీఓను శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు విట్టల్ గౌడ్, చంద్రయ్య, నయీమ్, కిషన్, వెంకాగౌడ్, నర్సింలు, శ్రీనివాస్, ప్యాలాల శ్రీనివాస్ పాల్గొన్నారు.