పోచారం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు పరిశీలించిన ఆర్డీఓ

స్థానిక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి-మెదక్ జిల్లాల సరిహద్దులోని పోచారం చెక్ పోస్టు వద్ద సోమవారం ఆర్డీవో పార్థసింహారెడ్డి తనిఖీలు చేపట్టారు. చెక్ పోస్టు వద్ద సిబ్బంది విధులు, వాహనాల తనిఖీలు, పరికరాల వాడకం, వీడియో రికార్డింగ్, రికార్డులను ఆయన పరిశీలించారు. ఆధారాలు లేకుండా నగదు, బంగారం, ఉచిత రుణాలు, సొంత డబ్బు వాహనాల్లో తరలిస్తే కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్