వేసవి తాపాన్ని తగ్గించేందుకు ప్రకృతి సిద్ధమైన, పోషకాలు కలిగిన తాటి ముంజలు మంచి ఎంపిక. వీటిని 'ఐస్ ఆపిల్స్' అని కూడా పిలుస్తారు. కల్తీలేని, స్వచ్ఛమైన పండుగా వీటిని భావిస్తారు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంతో పాటు బొగ్గుగుడిసే, లింగంపేట్ - కామారెడ్డి ప్రధాన రహదారి ప్రక్కన తాటి ముంజల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వీటి రుచి, స్వచ్ఛత కారణంగా వీటికి మంచి గిరాకీ ఉంది.