మతసామరస్యం, సోదరభావం పెంపొందించాలి: షబ్బీర్ అలీ

అపోహలను తొలగించి, మతసామరస్యం, సోదరభావాన్ని బలోపేతం చేయాలని కామారెడ్డి జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జమాతే ఇస్లామీ హింద్ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభమైన 3 రోజుల ప్రదర్శన, సదస్సు ‘బియాండ్ ది డివైడ్ – కౌంటరింగ్ హేట్, బిల్డింగ్ హార్మనీ’ ప్రారంభోత్సతవ సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జమాతే ఇస్లామీ హింద్ నాయకులు, నిర్వాహకులతో కలిసి వివిధ స్టాళ్లను సందర్శించారు. విద్వేషాలను తగ్గించడం, అపోహలను తొలగించడం, భిన్న వర్గాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడం బాగుందన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕